Andhra Pradesh Horror: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం, ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ వైరు తగిలి నలుగురు యువకులు మృతి, వీడియో ఇదిగో..
విద్యుత్ షాక్‌తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో పైన ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలి గ్రామానికి చెందిన నలుగురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇక స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఉండ్రాజవరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Four youths died after being hit by an electric wire
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)