Andhra Pradesh: కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం దందా, టీడీపీ ఎమ్మెల్యే వనమాడిపై మండిపడిన పవన్ కళ్యాణ్, జాగ్రత్తగా ఉండాలని అధికారులకు వార్నింగ్
కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) నేడు కాకినాడ(Kakinada)లో పర్యటించారు. యాంకరేజి పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. పోర్టు నుంచి పేదల బియ్యం(పీడీఎస్) విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం తనిఖీలకు వెళ్లారు. కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు.ఇన్ని చెక్‌పోస్టులు ఉన్నా రేషన్ బియ్యం పోర్టు లోపలికి ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. అధికారుల పేర్లు నమోదు చేసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
Pawan Kalyan angry for smuggling of ration rice
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)