Rain In Tirumala: తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వాన, వీడియో ఇదిగో..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమాడ వీధుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి.

Incessant rain on Tirumala Hill Watch Video

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమాడ వీధుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. తిరుమలలో భారీ వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పందించారు. భక్తులు వర్షంలో ఉండొద్దని, షెడ్లు ఖాళీ అయిన వెంటనే లోపలికి పంపిస్తామని చెప్పారు.

నెల్లూరు జిల్లాకు హై అలర్ట్, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Here's Rain Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)