Young Man Dies of Heart Attack: షాకింగ్ వీడియో, స్నేహితుడి పెళ్లి వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుతో యువకుడు మృతి, కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన

కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ఓ యువకుడు తన స్నేహితుడికి బహుమతి ఇస్తూ స్టేజిపైనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

young man died of a heart attack at a friend's wedding in Kurnool

కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ఓ యువకుడు తన స్నేహితుడికి బహుమతి ఇస్తూ స్టేజిపైనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహానికి తన మిత్రులతో కలిసి వచ్చాడు వంశీ. తోటి స్నేహితులతో కలిసి వివాహ వేదికపైకి ఎక్కి గిఫ్టు ఇస్తున్నారు.

శివాలయంలో పూజ చేస్తూ శివుడి చెంతకు, గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తి...వైరల్ వీడియో

ఈ క్రమంలో వంశీ కాస్త అస్వస్థతకు లోనైనట్లు అనిపించి స్నేహితుడి సాయం అడిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఐతే అతడిని పట్టుకునేలోపుగానే అతడు స్టేజిపై కుప్పకూలిపోయాడు.అతడిని వెంటనే డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీని పరీక్షించిన వైద్యులు అతడి అప్పటికే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. మృతుడు వంశీ బెంగళూరులోని అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు అతడి స్నేహితులు తెలిపారు.

young man died of a heart attack at a friend's wedding 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)