Punjab: పోలీసులపై కత్తులు,కర్రలతో దాడి చేసిన నిహాంగ్‌లు, సుమారు 30 మంది పంజాబ్ కాప్స్‌కు గాయాలు, దేశవ్యాప్తంగా సిక్కు ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న క్వామీ ఇన్సాఫ్ మోర్చా
బుధవారం చండీగఢ్‌లోని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అధికారిక నివాసానికి చేరుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కత్తులు, కర్రలతో నిహాంగ్‌లు, నిరసనకారులు దాడి చేశారు.
పంజాబ్ పోలీసులపై నిహాంగ్‌లు కత్తులు, కర్రలతో దాడి చేసిన సంఘటనలో సుమారు 30 మంది పోలీసులు గాయపడ్డారు. దేశవ్యాప్తంగా సిక్కు ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘క్వామీ ఇన్సాఫ్ మోర్చా’ పేరుతో పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు చండీగఢ్-మొహాలీ సరిహద్దు సమీపంలోని వైపీఎస్ చౌక్ వద్ద జనవరి 7 నుంచి నిరసనలు చేస్తున్నారు. సాయుధులైన నిహాంగ్‌లు కూడా ఇందులో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా బుధవారం చండీగఢ్‌లోని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అధికారిక నివాసానికి చేరుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కత్తులు, కర్రలతో నిహాంగ్‌లు, నిరసనకారులు దాడి చేశారు. ఆందోళనకారుల దాడిలో సుమారు 30 మంది పోలీసులు గాయపడ్డారు. పలు పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులపై దాడి చేసిన ఆందోళనకారులు, నిహాంగ్‌లను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ రంజన్ తెలిపారు. చండీగఢ్‌లో 144 సెక్షన్ అమలులో ఉందని చెప్పారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)