Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసు, మూడురోజుల సీబీఐ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్, 29న సాయంత్రం 7గంటల్లోగా కోర్టులో హాజరుపరుచాలని ఆదేశాలు

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మూడురోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆయనను బుధవారం తిహార్‌ జైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఆయనను హాజరుపరిచిన సీబీఐ.. ఐదురోజుల కస్టడీకి కోరింది.

Delhi CM Arvind Kejriwal (photo-ANI

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మూడురోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆయనను బుధవారం తిహార్‌ జైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఆయనను హాజరుపరిచిన సీబీఐ.. ఐదురోజుల కస్టడీకి కోరింది. అయితే, కోర్టు మూడురోజులు కస్టడీకి అనుమతించింది. ఆయనను 29న సాయంత్రం 7గంటల్లోగా కోర్టులో హాజరుపరుచాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. కోర్టులో విచారణ సమయంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ మనీష్‌ సిసోడియాపై తాను వాంగ్మూలం ఇచ్చానని సీబీఐ చెబుతోందని.. ఇందులో వాస్తవం లేదన్నారు. మనీష్‌ సిసోడియా నిర్దోషి అని.. ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం ఎలాంటి తప్పుచేయలేదని.. తాను సైతం నిర్దోషినేనన్నారు.  అరవింద్ కేజ్రీవాల్‌కు పడిపోయిన షుగర్ లెవెల్, టీ, బిస్కెట్ల కోసం కోర్టు హాలు నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now