Assam Floods: వరదలతో విలవిలలాడుతున్న అస్సాం, ముగ్గురు మృతి, 57 వేల మందిపై వరదల ప్రభావం, రంగంలోకి దిగిన ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది

ఈశాన్య రాష్ట్రం అస్సాం వరదలతో అతలాకుతలం అవుతోంది. ఏడు జిల్లాల్లో 15 రెవెన్యూ సర్కిళ్లలోని దాదాపు 222 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 10321.44 హెక్టార్ల పంట నీట మునిగింది. ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అలాగే, 1,434 జంతులు కూడా వరద బారినపడ్డాయి.

Assam Floods Pic Credit- ANI

ఈశాన్య రాష్ట్రం అస్సాం వరదలతో అతలాకుతలం అవుతోంది. ఏడు జిల్లాల్లో 15 రెవెన్యూ సర్కిళ్లలోని దాదాపు 222 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 10321.44 హెక్టార్ల పంట నీట మునిగింది. ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అలాగే, 1,434 జంతులు కూడా వరద బారినపడ్డాయి. 202 ఇల్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా 57 వేల మందిపై వరదల ప్రభావం పడింది. రంగంలోకి దిగిన ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.

పలు జిల్లాల్లోని రోడ్లు, బ్రిడ్జిలు, కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వానలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రైల్వే ట్రాకులు, వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్డు రవాణా స్తంభించిపోయింది. వరదల నేపథ్యంలో నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే బయలుదేరిన రెండు రైళ్లు వరదల్లో చిక్కుుకున్నాయి. ఒక్కో దాంట్లో 1400 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్‌ఫోర్స్ సాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డిటోక్‌చెర్రా స్టేషన్‌లో 1,245 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని బదార్‌పూర్, సిల్చర్ రైల్వే స్టేషన్లకు తరలించారు. అలాగే, 119 మంది ప్రయాణికులను భారత వైమానిక దళం సిల్చర్‌కు తరలించింది. చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆహారం, తాగు నీరు సరఫరా చేస్తున్నట్టు రైల్వే పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now