Ram Temple Extends Darshan Time: అయోధ్య వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతర దర్శనం
ప్రాణ ప్రతిష్ట జరిగిన మర్నాడు అంటే మంగళవారం ఐదు లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక రెండో రోజు.. నేడు (బుధవారం) బాలక్ రామ్ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.
ప్రాణ ప్రతిష్ట జరిగిన మర్నాడు అంటే మంగళవారం ఐదు లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక రెండో రోజు.. నేడు (బుధవారం) బాలక్ రామ్ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా రామాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతర దర్శనం ఉంటుందని జిల్లా యంత్రాంగం, శ్రీరామజన్మభూమి ట్రస్టు తెలిపింది. అయితే హారతి, భోగం కోసం సమయంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేస్తున్నట్లు ట్రస్టు పేర్కొంది.నేటి ఉదయం ప్రవేశ ద్వారం వెలుపల కిలోమీటరుకు పైగా భక్తుల క్యూలు కనిపించాయి. ఈ నేపధ్యంలో పోలీసులు, ఆలయ నిర్వాహకులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. బాల రాముడి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు, మొదటి రోజు ఏకంగా 5 లక్షల మంది దర్శనం, 100 కి.మీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Here's Video