Ram-Lalla-Idol-HD-Wallpapers-1

Ayodhya, JAN 24: అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. బాలరాముడిని (Ram Lalla) దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. సోమవారం అయోధ్య రామాలయం గర్భగుడిలో (Ayodhya) బాల రాముడి విగ్రహానికి పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేశారు. మంగళవారం నుంచి సాధారణ భక్తులకు  (Aypdhya Devotees)బాలరాముడి దర్శనానికి అనుమతించారు. రాముడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తజనసంద్రోహంగా మారింది. భక్తులను అదుపుచేసేందుకు పోలీసులకు సవాలుగా మారింది. సుమారు 8వేల మంది పోలీసులను ఆలయం వద్ద అందుబాటులో ఉంచారు. అయినా, భారీగా రాముని దర్శనంకోసం వచ్చిన భక్తులను కట్టడిచేయడంలో పోలీసులు తంటాలు పడ్డారు.

 

శ్రీరాముడి దర్శనంకోసం సోమవారం అర్థరాత్రి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం ఉదయం 6గంటల నుంచి భక్తులను ఆయల కాంప్లెక్సులోనికి అనుమతించారు. అయితే, దర్శనానికి సమయాన్ని రెండు భాగాలు విభజించారు. ఉదయం 7గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు బాలరాముని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో తొలిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 5లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ లో ఎరియల్ సర్వే నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు సూచనలు చేశారు.

 

భక్తులు భారీ సంఖ్యలో శ్రీరాముడి దర్శనానికి వస్తుండటంతో వృద్ధులు, వికలాంగులు ఆలయ దర్శనాన్ని రెండు వారాల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. అయోధ్యలో రామ్ లల్లాకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తరువాత బాలరాముడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రెండోరోజూ తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. తీవ్రమైన చలి, పొగమంచు, చలిగాలులనుసైతం లెక్కచేయకుండా రాంపథం, ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు బాలరాముని దర్శనంకోసం వేచిఉన్నారు. వారంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీరామ స్మరణ చేశారు. మరోవైపు అయోధ్యకు వచ్చే దారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి. దీంో 100 కిలో మీటర్ల దూరంలోని బారాబంకిలో పోలీసులు అయోధ్య రామాలయం వైపు ప్రజలు వెళ్లకుండా విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని వాహనాలను దారి మళ్లించారు. ఆలయ నిర్వాహకులు పంచకోసి పరిక్రమ మార్గం దగ్గర అన్ని వాహనాలను నిలిపివేశారు.