Ayodhya Dham junction: అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్‌గా మార్చిన రైల్వే శాఖ, రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు కీలక నిర్ణయం
Ayodhya Train Station Renamed as Ayodhya Dham junction: అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్ (Ayodhya Train Station) పేరును ‘అయోధ్య ధామ్ జంక్షన్’ (Ayodhya Dham junction)గా పేరు మార్చింది. రైల్వే స్టేషన్ పేరు మార్పు ప్రతిపాదనను యోగి సర్కార్ రైల్వే శాఖ ముందు ఉంచగా.. ఆ ప్రతిపాదనను రైల్వే శాఖ అంగీకరించింది. దీంతో అయోధ్య రైల్వే జంక్షన్ ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా మారింది.
రప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సదుపాయాలతో అయోధ్యలో రైల్వే స్టేషన్‌ను నిర్మించింది. ఈ రైల్వే స్టేషన్‌ను డిసెంబర్ 30న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు అయోధ్యలోని విమానాశ్రయాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)