Crime (Credits: X)

Hyderabad, Mar 3: హైదరాబాద్ లో (Hyderabad) ఇటీవలి కాలంలో కారు ప్రమాదాలు (Car Accidents) పెరిగిపోయాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాజాగా ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ ఘాట్ ముందున్న డివైడర్ ను ఢీకొట్టిన ఓ కారు ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసమయ్యాయి. అయితే, రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులోనే ఈ కారు ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసుల విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బెంగుళూరులో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రెండు BMTC బస్సుల మధ్య ఇరుక్కుపోయిన ఆటో, డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు మృతి

Here's Video:

అత్తాపూర్ లో ఘోరం

హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పాండురంగా నగర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంటి బయట తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అంకితని ఓ కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ఆ చిన్నారి ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు.  అయితే, కారు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ కారణంగానే అంకిత చనిపోయినట్టు గుర్తించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టిన ట్రక్కు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో 7 మందికి గాయాలు