Bangladesh Unrest: బంగ్లాదేశ్ అల్లర్లు, ప్రధాని మోదీ నివాసంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ అత్యవసర భేటీ, వీడియో ఇదిగో..

బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉప సంఘం అత్యవసరం భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఈ భేటీలో సమీక్షించనున్నారు

On the situation in Bangladesh, a high-level meeting is underway at PM Narendra Modi's residence

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనలు చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి సోమవారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు.  నిరసనలతో భగ్గుమంటున్న బంగ్లాదేశ్, అన్ని విమాన సర్వీసులు, రైళ్లను రద్దు చేసిన భారత్, ఎల్ఐసీ ఆఫీసు మూసివేత

కాగా బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉప సంఘం అత్యవసరం భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఈ భేటీలో సమీక్షించనున్నారు. ప్రధాని మోదీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అజిత్ ధోవల్ పాల్గొన్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement