Barmer Road Accident: రాజ‌స్థాన్‌ రోడ్డు ప్ర‌మాదం, మృతుల కుటుంబాలకు రూ.2 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ, గాయ‌ప‌డిన వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా

రాజ‌స్థాన్‌లోని బ‌ర్మేర్‌-జోధ్‌పూర్ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదంలో (Barmer Road Accident) మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రూ.2 ల‌క్ష‌ల చొప్పున ( PM Narendra Modi announces ₹2 lakh ex-gratia ) ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి కూడా రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

Both vehicles caught fire after the collision. Fire tenders were rushed to the spot to douse the flames.(Twitter/@GajendraKhimsar)

రాజ‌స్థాన్‌లోని బ‌ర్మేర్‌-జోధ్‌పూర్ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదంలో (Barmer Road Accident) మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రూ.2 ల‌క్ష‌ల చొప్పున ( PM Narendra Modi announces ₹2 lakh ex-gratia ) ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి కూడా రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం ట్విట్ట‌ర్‌లో ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

ప్ర‌ధాన‌మంత్రి నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్‌) నుంచి ఈ నిధుల‌ను అందించనున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ఉద‌యం రాజ‌స్థాన్‌లోని బ‌ర్మేర్ జిల్లాలో బ‌ర్మేర్‌-జోధ్‌పూర్ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు, ఆయిల్ ట్యాంక‌ర్ ఎదురెదురుగా ఢీకొన‌డంతో పెద్దఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మ‌ర‌ణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Here's PMO Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement