Video: ప్రధాని మోదీ ప్రారంభించిన మెట్రోస్టేషన్‌లోకి భారీగా వరద నీరు, ప్రచారం కోసం ప్రారంభించారా అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్న నెటిజన్లు
రూ.4,249 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గత వారం ప్రారంభించిన మెట్రో స్టేషన్‌ను నాలుగు రోజుల్లోనే వరదలు ముంచెత్తాయి.బెంగళూరు (Bengaluru) లో రెండో దశ కింద వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం వరకు 13.71 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. రూ.4,249 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
అయితే మంగళవారం బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దీంతో నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌ను వర్షం నీరు ముంచెత్తింది. ప్లాట్‌ఫారమ్, టికెట్ కౌంటర్ దగ్గర భారీగా వర్షం నీరు చేరింది. వరదలమయంగా మారిన మెట్రో స్టేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. ప్రధాని మోదీ ప్రచారం కోసమే ఈ మెట్రో లైన్‌ను ప్రారంభించారని పలువురు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)