Bengaluru Rains: షాకింగ్ వీడియోలు, భారీ వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్న బెంగుళూరు, నీటిపై తేలుతూ కొట్టుకుపోతున్న బైకులు
బెంగళూరులో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. తాజాగా ఈ ఉదయం కురిసిన వర్షం పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. రోడ్లన్నీ చెరువులను తలపించగా, పలువురు నీటిలో చిక్కుకుపోయారు. నగరంలోని బెలందూర్, సర్జాపురా రోడ్డు, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్‌రోడ్డు, బీఈఎంఎల్ లే అవుట్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
మరాఠహళ్లి సమీపంలోని స్పైస్ గార్డెన్ వద్ద బైకులు నీటిపై తేలుతూ కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో వరద ముంచెత్తడంతో స్పైస్ గార్డెన్ నుంచి వైట్‌ఫీల్డ్ వెళ్లే దారి స్తంభించిపోయింది. నగరంలో పలు ఖరీదైన సొసైటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తమను రక్షించాలంటూ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి సొసైటీ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)