Bus Catches Fire: ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం, మంటలు చెలరేగి నడిరోడ్డుపై మాడి మసైపోయిన బస్సు, ప్రయాణికులంతా సేఫ్

ముంబైలో బాంద్రా ప్రాంతంలో బృహన్‌ ముంబైకి చెందిన విద్యుత్‌ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Bus Catches Fire (Photo-ANI)

ముంబైలో బాంద్రా ప్రాంతంలో బృహన్‌ ముంబైకి చెందిన విద్యుత్‌ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఘటనకు సమీపంలో పెట్రోల్‌ బంక్‌ ఉండటంతో మంటలు వ్యాపించకుండా అధికారులు ఆర్పివేశారు. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement