Bharat Atta Launched: 27 రూపాయలకే కిలో భారత్ బ్రాండ్ గోధుమ పిండి, విక్రయం కోసం 100 మొబైల్ వ్యాన్‌లను జెండా ఊపి ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

భారత్' బ్రాండ్‌లో గోధుమ పిండి (అట్టా) విక్రయం కోసం 100 మొబైల్ వ్యాన్‌లను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ నుండి జెండా ఊపి ప్రారంభించారు

Govt Launches Sale of Atta Under Bharat Brand (Photo Credits: X/@PIB_India)

'భారత్' బ్రాండ్‌లో గోధుమ పిండి (అట్టా) విక్రయం కోసం 100 మొబైల్ వ్యాన్‌లను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ నుండి జెండా ఊపి ప్రారంభించారు.కిలో రూ.27.50కి మించకుండా ఎంఆర్‌పీతో గోధుమపిండి లభిస్తుంది. 'భారత్' బ్రాండ్ అట్టా యొక్క రిటైల్ విక్రయాన్ని ప్రారంభించడం వలన మార్కెట్‌లో సరసమైన ధరలకు సరఫరా పెరుగుతుంది. ఈ ముఖ్యమైన ఆహార పదార్ధం ధరల నియంత్రణను కొనసాగించడంలో సహాయపడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

సోమవారం (నవంబర్ 6) నుండి కేంద్రీయ భండార్, NAFED, NCCF యొక్క అన్ని అవుట్‌లెట్లలో భారత్' అట్టా అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర సహకార రిటైల్ అవుట్‌లెట్‌లకు విస్తరించబడుతుంది. దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కిలోకు రూ. 21.50 చొప్పున సెమీ-గవర్నమెంట్, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ అంటే కేంద్రీయ భండార్, NCCF, NAFED కోసం ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS (D)) కింద అట్టాగా మార్చడానికి, విక్రయించడానికి కేటాయించబడింది

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)