Bihar: బిహార్‌లో తీవ్ర విషాదం, పిడుగులు పడి 11 మంది మృతి, సంతాపం తెలిపిన సీఎం నితీష్ కుమార్, మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

బిహార్‌లోని మూడు జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం పూర్నియా జిల్లాలో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, అరారియాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ సంతాపం తెలిపారు.

Bihar CM Nitish Kumar (photo-ANI)

బిహార్‌లోని మూడు జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం పూర్నియా జిల్లాలో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, అరారియాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. కఠిన వాతావరణ పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలంటూ ట్వీట్‌ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement