Agnipath Scheme Protest: అగ్నిప‌థ్ స్కీమ్‌ను ర‌ద్దు చేయాల‌ని 72 గంట‌ల డెడ్‌లైన్, బీహార్‌లోని ల‌ఖ్మినియా రైల్వే స్టేష‌న్‌కు నిప్పుపెట్టిన యువత

అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా విధ్వంసం కొన‌సాగుతోంది. ఇవాళ కూడా బీహార్‌లో యువ‌త చెల‌రేగిపోయారు. కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. ఇవాళ నిర‌స‌న‌కారులు బీహార్‌లోని ల‌ఖ్మినియా రైల్వే స్టేష‌న్‌కు నిప్పుపెట్టారు.

Agnipath Scheme Protest (Photo-Video Grab)

అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా విధ్వంసం కొన‌సాగుతోంది. ఇవాళ కూడా బీహార్‌లో యువ‌త చెల‌రేగిపోయారు. కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. ఇవాళ నిర‌స‌న‌కారులు బీహార్‌లోని ల‌ఖ్మినియా రైల్వే స్టేష‌న్‌కు నిప్పుపెట్టారు. రైల్వే ట్రాక్‌ల‌ను ధ్వంసం చేసి రైళ్ల‌ను నిలిపివేశారు. భ‌గ‌ల్‌పూర్‌, న్యూఢిల్లీ మ‌ధ్య న‌డిచే విక్ర‌మ్‌శిలా ఎక్స్‌ప్రెస్‌, జ‌మ్మూతావి-గౌహ‌తి ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు నిర‌స‌న‌కారులు నిప్పుపెట్టారు. అగ్నిప‌థ్ స్కీమ్‌ను ర‌ద్దు చేయాల‌ని 72 గంట‌ల డెడ్‌లైన్ జారీ చేశారు.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement