Bihar Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైకును గుద్దిన కారు, అదుపుతప్పి మరో మార్గంలోకి వెళ్లడంతో ఆ రెండింటిని గుద్దిన ట్రక్కు, తొమ్మిమి మంది అక్కడికక్కడే మృతి

బీహార్‌లోని (Bihar) కైమూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్‌ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్‌కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

Kaimur Road Accident (Photo Credit: PTI)

బీహార్‌లోని (Bihar) కైమూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్‌ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్‌కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు అదుపుతప్పి మరో మార్గంలోకి వెళ్లడంతో ఎదురుగా వస్తున్న ట్రక్కు వాటిని గుద్దింది.

జీపులో ఉన్న ఎనిమిది మందితో పాటు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement