Bomb Threat in Uttar Pradesh: కాన్పూర్‌లో పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు, బాంబులతో పేల్చివేస్తామంటూ మెయిల్, వీడియో ఇదిగో..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సుమారు పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబులతో పేల్చివేస్తామంటూ ఆ స్కూళ్లకు ఈమెయిల్స్ అందాయి.ఈ విషయం తెలియడంతో జిల్లా యంత్రాంగతం అప్రమత్తమైంది. పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు ఆయా స్కూళ్లకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సుమారు పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబులతో పేల్చివేస్తామంటూ ఆ స్కూళ్లకు ఈమెయిల్స్ అందాయి.ఈ విషయం తెలియడంతో జిల్లా యంత్రాంగతం అప్రమత్తమైంది. పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు ఆయా స్కూళ్లకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. విద్యార్థులు, స్కూల్స్ సిబ్బందిని ఇళ్లకు పంపివేశారు. రష్యాలోని సర్వర్‌ల ద్వారా ఈమెయిల్స్ వచ్చాయని పోలీస్ అధికారి తెలిపారు. స్కూళ్లకు బాంబు బెదిరింపులపై సైబర్ సెల్ విభాగం దర్యాప్తు చేస్తున్నదని చెప్పారు.
మరోవైపు మంగళవారం బెంగళూరులోని ఎనిమిది స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. గత వారం కూడా నగరంలోని ప్రముఖ హాస్పిటల్ చైన్ అయిన సెయింట్ ఫిలోమినాకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపు ఈమెయిల్‌లన్నీ బూటకమని ఆ తర్వాత తేలింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)