Bombay High Court: భార్య చేసే పనిని అత్తమామలకు వాట్సాప్ వీడియో కాల్‌లో భర్త చూపించడం శాడిస్ట్ పద్ధతి, బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఓ మహిళ ఇంటిని శుభ్రం చేయమని కోరడం,ఆ పని చేస్తూ అత్తమామలకు వాట్సాప్ వీడియో కాల్‌లో చూపించడం శాడిస్ట్ పద్ధతి అని బాంబే హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై సెక్షన్ 498-ఎ కింద దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్)ను కొట్టివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఓ మహిళ ఇంటిని శుభ్రం చేయమని కోరడం,ఆ పని చేస్తూ అత్తమామలకు వాట్సాప్ వీడియో కాల్‌లో చూపించడం శాడిస్ట్ పద్ధతి అని బాంబే హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై సెక్షన్ 498-ఎ కింద దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్)ను కొట్టివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హార్దిక్ షా అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు అజయ్ గడ్కరీ, డాక్టర్ నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. పిటిషనర్, అతని తండ్రి, ముగ్గురు వివాహిత సోదరీమణులు తనను క్రూరత్వానికి గురిచేశారని మహిళ ఆరోపించింది. తన ముగ్గురు ఆడపడుచులు తమ ఇళ్లలో కూర్చొని ఇంటి పనుల్లో జోక్యం చేసుకున్నారని భార్య పేర్కొంది. భార్యాభర్తల విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు, వివాహేతర సంబంధం గురించి కోర్టు విచారించాల్సిన అవసరం లేదని వెల్లడి
Here's Live Law Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)