Border Row: కర్ణాటకలో కలిసిన 865 గ్రామాలు ఇక మహారాష్ట్రలోకి, మరాఠీ భాష మాట్లాడే గ్రామాలను రాష్ట్రంలో కలిపే తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిసిన మహా అసెంబ్లీ
మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు కీలక తీర్మానం ఏక గ్రీవంగా ఆమోదం పొందింది. ఈ తీర్మానం ద్వారా మరాఠీ భాష మాట్లాడే కర్నాటకలోని 865 గ్రామాలను మహారాష్ట్రలో కలపనున్నారు. కర్నాటకతో బోర్డర్ సమస్య ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో సీఎం ఏకనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు కీలక తీర్మానం ఏక గ్రీవంగా ఆమోదం పొందింది. ఈ తీర్మానం ద్వారా మరాఠీ భాష మాట్లాడే కర్నాటకలోని 865 గ్రామాలను మహారాష్ట్రలో కలపనున్నారు. కర్నాటకతో బోర్డర్ సమస్య ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో సీఎం ఏకనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తీర్మానాన్ని ఏకనాథ్ ప్రవేశపెట్టారు. ఇటీవల కర్నాటక అసెంబ్లీలోనూ బోర్డర్ అంశంపై ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సరిహద్దులో 865 గ్రామాల్లో మరాఠీ మాట్లాడేవారున్నారని, ఆ గ్రామాలకు చెందిన ప్రతి ఇంచును మహారాష్ట్రలో కలుపుతామని, సుప్రీంకోర్టులో కావాల్సిన ఆధారాలను చూపిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. బెల్గామ్, కర్వార్, బీదర్, నిపాని, భల్కి ప్రదేశాల్లో ఉన్న 865 గ్రామాలను ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
Here's ANI Tweets