BPSC Exam Row: బీపీఎస్‌సీ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్, ప్రశాంత్ కిషోర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, ష్యూరిటీ బాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన జన్ సురాజ్ చీఫ్
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ చేపట్టిన నిరాహార దీక్షను పాట్నా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనందున అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. తాజాగా పాట్నా సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ చేపట్టిన నిరాహార దీక్షను పాట్నా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనందున అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. తాజాగా పాట్నా సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ ష్యూరిటీ బాండ్ ఇచ్చేందుకు పీకే నిరాకరించారు.
దీంతో ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీనిపై ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. కోర్టు తనకు బెయిలు మంజూరు చేసినప్పటికీ, ఎలాంటి తప్పిదాలు చేయరాదని ఆ ఆదేశాల్లో రాసి ఉందని, దీంతో బెయిల్ ఆర్డర్‌ను తోసిపుచ్చానని, జైలుకు వెళ్లేందుకు అంగీకరించానని తెలిపారు. కాగా గత ఏడాది డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్‌సీ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై జనవరి 2 నుంచి ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
Prashant Kishor Sent to 14-Day Judicial Custody
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)