Byju's Layoffs: 1000 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్, ఆర్థిక మాంద్య భయాలు, నిధుల కొరతతో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఎడ్‌టెక్ కంపెనీ

ఇందులో భాగంగా బైజూస్ మరో 1,000-1,200 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఇంజనీరింగ్, సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ టీమ్‌ల నుండి ఉద్యోగులను తొలగిస్తోంది.

Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ నెమ్మదిగా ఆదాయ వృద్ధి, నిధుల కొరతతో ఖర్చులను తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగా బైజూస్ మరో 1,000-1,200 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఇంజనీరింగ్, సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ టీమ్‌ల నుండి ఉద్యోగులను తొలగిస్తోంది. ఇంజనీరింగ్ బృందం నుండి సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే లాజిస్టిక్స్ బృందం బలం అక్టోబర్‌ నుంచి 50 శాతానికి తగ్గిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైజూస్ లాజిస్టిక్స్‌ను ఔట్‌సోర్సింగ్ చేస్తోందని, అందువల్ల కంపెనీ తన అంతర్గత లాజిస్టిక్స్ టీమ్ పరిమాణాన్ని 50 శాతం తగ్గించిందని తెలుస్తోంది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)