Winter storm hits Southern US (photo-@ClimateSoluti0n)

Florida, Jan 22:  దక్షిణ అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. దీని దెబ్బకు ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ నుంచి ఫ్లోరిడా, నార్త్ కరోలినా వరకు విస్తరించిన ఈ మంచు తుపాను (Winter Storm Hits US) ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. రికార్డుస్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా న్యూఓర్లీన్స్, అట్లాంటా, జాక్సన్‌విల్లే నగరాలు గడ్డకట్టుకుపోయాయి. విపరీతంగా కురుస్తున్న మంచుకు తోడు చలిగాలులు వణికిస్తున్నాయి.

ఆర్కిటిక్ ప్రాంతం నుంచి మధ్య పశ్చిమ, తూర్పు అమెరికా ప్రాంతాల మీదుగా వీస్తున్న గాలి వాతావరణం గడ్డకట్టదానికి కారణమవుతోంది. న్యూయార్క్‌ నగరంలో పలు చోట్ల 18 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. దీంతో పలు కౌంటీల్లో న్యూయార్క్‌ గవర్నర్‌ ఎమర్జెన్సీ విధించారు. న్యూ ఓర్లియాన్స్‌, ఫ్లోరిడా పెన్సాకోలాలో రికార్డ్‌స్థాయిలో 6.5 అంగుళాల మేర మంచు కురిసింది. కెనడాలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్‌ 50 డిగ్రీలకు పడిపోయాయి

వీడియోలు ఇవిగో, లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మంటల కార్చిచ్చు, గంటల వ్యవధిలోనే 9 వేల 400 ఎకరాలు కాలి బూడిద, దాదాపు 50వేల మందిని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశాలు

ఫలితంగా 2200 విమాన సర్వీసులు రద్దయ్యాయి. 3 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. న్యూఓర్లీన్స్‌లో రికార్డుస్థాయిలో 10 అంగుళాల (25 సెంటీమీటర్లు) మేర మంచు కురిసింది.

Winter storm hits Southern US:

జాతీయ వాతావరణ సేవల విభాగం ప్రకారం అలస్కాలో డిసెంబరు నుంచి కురుస్తున్న హిమపాతాన్ని ఇది అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది. నేడు కూడా ఇక్కడ శీతల ఉష్ణోగ్రతలు, చల్లని గాలుల తీవ్రత కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది.