Los Angeles, Jan 23: అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మంటల కార్చిచ్చు చెలరేగింది. ఇటీవల అక్కడ చెలరేగిన దావానలం చల్లారక ముందే మరోమారు మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడుతున్నాయి. కాస్టాయిక్ లేక్ సమీపంలో కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు (Los Angeles wildfires) ఎగసిపడుతున్నాయి. గంటల వ్యవధిలోనే మంటలు 9,400 వేల ఎకరాలకు (Los Angeles explodes to 9,400 acres) వ్యాపించాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ (forces evacuations) చేయిస్తున్నారు.కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అగ్నికీలలు 39 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న చెట్లను, పొదలను బూడిద చేశాయని అధికారులు వెల్లడించారు.
తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవలి దావానలంలో కాలి బూడిదైన ఈటన్, పాలిసేడ్స్‌కు 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు ఈ కార్చిచ్చుకు మరింతగా ఆజ్యం పోస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో విమానాలతో వాటర్ బాంబులను జారవిడుస్తున్నారు.
New wildfire near Los Angeles explodes to 9,400 acres
California Fires‼️
Hughes Fire in Los Angeles, California has spread to over 5000 acres and has no containment. Strong winds cause fire tornados.
Similar to the fire tornados we saw in the Palisades fires pic.twitter.com/8ZRSW2IUp3
— Alertas Climáticos 🌊🚨 (@alertasdoclima) January 22, 2025
కాగా, ఇటీవల లాస్ ఏంజెలెస్‌లోనే చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలను బూడిద చేసింది. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు పాలిసేడ్స్‌లో 68 శాతం, ఈటనలో 91 శాతం మంటలను అదుపు చేశారు.తాజా కార్చిచ్చుతో దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ గంటకు 67 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) నాటికి ఇది గంటకు 96 కిలోమీటర్లకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.