Patna High Court: జీవిత భాగస్వామిని ‘భూతం’ అనడం క్రూరత్వం కాదు.. విడాకుల కేసులో పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జీవిత భాగస్వామిని ‘భూతం, పిశాచి’ అంటూ పిలువడం క్రూరత్వం కిందకేమీ రాదని పాట్నా హైకోర్టు అభిప్రాయపడింది. ఓ విడిపోయిన భార్యాభర్తల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Newdelhi, Mar 31: జీవిత భాగస్వామిని ‘భూతం (Bhoot), పిశాచి’ (Pishachi) అంటూ పిలువడం క్రూరత్వం కిందకేమీ రాదని పాట్నా హైకోర్టు అభిప్రాయపడింది. ఓ విడిపోయిన భార్యాభర్తల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే కట్నం కోసం భర్త నరేష్ గుప్తా, మామ సహదేవ్ గుప్తా తనను హింసకు గురి చేస్తున్నారంటూ, భూతం అంటూ భర్త తిడుతున్నాడని ఒక మహిళ 1994లో కేసు వేసింది. దీనిపై ఏడాది శిక్ష పడగా, అడిషనల్ సెషన్స్ కోర్టు 10 ఏండ్ల తర్వాత దానిని సమర్థించింది. ఈ మధ్య కాలంలో సదరు భార్యాభర్తలకు జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో పై వ్యాఖ్యలు చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)