Delhi Metro: మెట్రో రైలులో రెండు మద్యం బాటిళ్లు తీసుకువెళ్లవచ్చు, మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధం, నెటిజన్‌కు సమాధానం ఇచ్చిన డీఎమ్‌ఆర్‌సీ

రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. అయితే మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధించింది.

Metro (Photo-Twitter)

Carrying alcohol permitted on Delhi Metro:మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? అనే నెటిజన్ ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(డీఎమ్‌ఆర్‌సీ ) సమాధానం తెలిపింది. రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. అయితే మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధించింది. అయితే.. ఢిల్లీలో ఎయిర్‌పోర్టు లైన్‌లో తప్పా మిగిలిన రూట్లలో మద్యం తీసుకురావడానికి ఇప్పటివరకు అనుమతి ఉండేది కాదు. కానీ ఇటీవల ఢిల్లీ మెట్రో నిబంధనలను సడలించింది. ఈ అంశంలో యాజమాన్యం సీఐఎస్‌ఎఫ్‌, డీఎమ్‌ఆర్‌సీ సభ్యులతో ఓ కమిటీని వేసింది. ఈ నివేదిక ప్రకారం మెట్రో ఏ రూట్‌లోనైనా ఒక వ్యక్తి రెండు బాటిళ్ల మద్యం వరకు తీసుకురావచ్చని తెలిపింది.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)