Caught On CCTV: వీడియో ఇదిగో, ఆవుపై పులి దాడి, వెంటాడి పులిని తరిమి తరిమి కొట్టిన ఆవుల మంద, రాత్రంతా గాయపడిన ఆవుకు కాపలాగా నిలిచిన మిత్రులు
దీని అరుపులు విన్న మంద అటువైపు తిరిగి పులిని చూసింది.
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కేర్వా ప్రాంతంలో రాత్రివేళ ఓ ఫామ్‌లో మందకు కాస్తంత దూరంలో నిద్రపోతున్న ఓ ఆవుపై పులి దాడిచేసి మెడ పట్టుకుంది. దీని అరుపులు విన్న మంద అటువైపు తిరిగి పులిని చూసింది. అంతే.. కలిసికట్టుగా అన్నీ వెళ్లి పులిని భయపెట్టాయి. తనపై దాడికి వచ్చిన మందను చూసిన పులి భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది.
ఆవుల మంద దాడిచేయడంతో పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిన పులి తిరిగి దాడిచేసేందుకు సమయం కోసం దాదాపు మూడు గంటలపాటు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. పులి దాడిలో గాయపడిన ఆవు చుట్టూ చేరిన మిగతా ఆవులు ఆ రాత్రంతా దానికి రక్షణగా నిలిచాయి. ఉదయం గాయపడిన ఆవును చూసిన యజమాని దానిని ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం దాని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, 76 ఎకరాల్లో ఫామ్‌లో దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)