National Turmeric Board: కేంద్రం గుడ్ న్యూస్, తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం, రూ.1,600 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పసుపు ఎగుమతులే లక్ష్యంగా ఏర్పాటు..

దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి మీడియాకు కేటినెట్‌ నిర్ణయాలకు వెల్లడించారు.

Union Minister G. Kishan Reddy (Photo Credit: ANI)

దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి మీడియాకు కేటినెట్‌ నిర్ణయాలకు వెల్లడించారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపిందిని కిషన్ రెడ్డి తెలిపారు. పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది. ట్రిబ్యునల్‌ ప్రాజెక్ట్‌లవారీగా నీటి కేటాయింపులను చేస్తుంది. తెలంగాణకు సంబంధించిన మూడు అంశాలను కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది అని అన్నారు.

పసుపు గురించి మాట్లాడితే.. నేడు రూ.1,600 కోట్ల విలువైన పసుపును ఎగుమతి చేస్తున్నాం, ఇప్పుడు రూ.8,400 కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయాలి...’’ అని కేంద్ర మంత్రి అన్నారు. క్యాబినెట్ నిర్ణయాలపై బ్రీఫింగ్ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)