Chandrababu Meet PM Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ, అమరావతి, పోలవరం నిధులుపై చర్చలు, విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లుగా వార్తలు

రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

Chandrababu Meet PM Modi (photo-TDP)

రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్‌ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన తీగల కృష్ణారెడ్డి, మ‌న‌వ‌రాలి పెళ్లికి ఏపీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి

అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర మంత్రి గడ్కరీని కలవనున్నారు. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో, రాత్రి 11.15 గంటలకు నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ కానున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశముంది.

Here's TDP Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now