Chennai Rains: వీడియో ఇదిగో, నడుం లోతు నీళ్లలో చొక్కాలు విప్పి విద్యార్థులు అవస్థలు, చెన్నై నగరాన్ని అస్తవ్యస్తం చేసిన వరదలు
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లేరు, కాంచీపురం, చెంగల్‌పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నై మహానగరం పూర్తిగా (Chennai Rain) నీట మునిగింది.
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లేరు, కాంచీపురం, చెంగల్‌పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నై మహానగరం పూర్తిగా (Chennai Rain) నీట మునిగింది.సోమవారం నుంచి చెన్నైలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. సబ్‌వేలు, అండర్‌పాస్‌ల్లోకి భారీగా వరద చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం స్టాలిన్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇక చెన్నైలోని సత్యబామ యూనివర్సిటీలో వరదల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)