Telangana Talli Statue Inauguration: వీడియో ఇదిగో, 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సచివాలయం ప్రాంగణంలో శాస్త్రోక్తంగా విగ్రహావిష్కరణ మహోత్సవం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులో నేటి సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వేదమంత్రాల సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Chief Minister Revanth Reddy unveiled the statue of Mother of Telangana

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులో నేటి సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వేదమంత్రాల సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గేయ రచయిత అందెశ్రీని సీఎం సన్మానించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

గుండుపూసలు, హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న కంకులు తెలంగాణ తల్లి చేతిలో పొందుపరిచారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సచివాలయం, ట్యాంక్ బండ్ పరిసరాలు జనసముద్రంగా మారాయి.

CM Revanth Reddy unveiled the statue of Mother of Telangana

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now