Cloudburst in Himachal Pradesh: వయనాడ్ తర్వాత ప్రకృతి ప్రకోపానికి బలైన హిమాచల్‌ ప్రదేశ్‌, భారీ వరదలకు ఇద్దరు మృతి, మరో 36 మంది గల్లంతు

కులులోని నిర్మంద్‌ బ్లాక్‌, మాలానా, మండి, సిమ్లా జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

Cloudburst in Himachal Pradesh

హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో వర్షం బీభత్సం సృష్టించింది. కులులోని నిర్మంద్‌ బ్లాక్‌, మాలానా, మండి, సిమ్లా జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.భారీ వరదలకు ఇదందరు మృతి చెందగా మూడు ప్రాంతాల్లో దాదాపు 36 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా అప్రమత్తమైన అధికారులు మండిలోని విద్యాసంస్థలను మూసివేస్తూ డీసీ ఉత్తర్వులు జారీ చేశారు.మండి తాల్తుఖోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షానికి పలుచోట్ల ఇండ్లు కూలినట్లు సమాచారం. రహదారులు దెబ్బతిన్నాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సంఘటనా స్థలానికి తరలించారు. మళ్లీ ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు,నీట మునిగిన కాలనీలు, రెడ్ అలర్ట్ జారీ, స్కూళ్లకు సెలవు, విమానాలు దారి మళ్లింపు, ఆగస్టు 5 వరకు వర్షాలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)