Heavy rain hits Delhi agains, IMD Issues Red Alert,All schools closed in Delhi,traffic disruptions in the city(PTI)

Delhi, Aug 1: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు మళ్లీ ముంచెత్తాయి. భారీ వర్షాలతో పలు కాలనీలు నీట మునగగా ఇళ్లు కూలిపోయాయి. పలు వాహనాల్లోకి నీరు చేరింది .భారీవర్షాలతో ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించింది. ఆగస్టు 5 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

భారీ వర్షాల కారణంగా ఢిల్లీకి రావాల్సిన 10 విమానాలను బుధవారం దారి మళ్లించారు. సాధారణ జనజీవనం స్తంభించగా ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. లుటెన్స్‌ ఢిల్లీ, కశ్మీర్‌ గేట్‌, రాజేంద్ర నగర్‌ ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీ-నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే ,మధుర రోడ్‌తో పాటు ప్రగతి మైదాన్, కాశ్మీర్ గేట్ ,సరాయ్ కాలే ఖాన్ వంటి ప్రధాన రహదారులు ట్రాఫిక్‌ మయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డ్ రాజిందర్ నగర్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వీధులన్నీ జలమయం కావడంతో మోకాలు లోతు నీటిలో నిలబడి ప్రజలు నిరసన తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికారులను ఆదేశించారు. మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయని మంత్రి అతిషి ప్రకటించారు. భారీ వర్షాలు కురిసే సూచనల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ట్రాఫిక్‌ పోలీసులు కొన్ని రూట్లలో ప్రయాణికులు వెళ్లకుండా రోడ్లను మూసివేశారు. ఉదయం నుండే దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం, యూపీలోని నోయిడాలోనూ కరుస్తున్న వర్షాలు, ఇబ్బందుల్లో ప్రజలు, వీడియో 

ఔటర్ రింగ్ రోడ్డులో, సావిత్రి ఫ్లైఓవర్ కింద నీరు నిలిచిపోవడంతో మూల్‌చంద్ నుండి చిరాగ్ ఢిల్లీ వైపు వెళ్లే క్యారేజ్‌వేపై మరియు అనువ్రత్ మార్గ్‌లోని రెండు క్యారేజ్‌వేలపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎన్‌ఎస్ మార్గ్ నుండి ఐఎస్‌బీటీ కాశ్మీరీ గేట్ వైపు వచ్చే ప్రయాణికులు కోడియా పుల్ మరియు మోరీ గేట్ బౌలేవార్డ్ రోడ్‌లో వెళ్లాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలతో కాలనీల్లో వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఐటీవో,ఆర్కే పురం, జన్‌పథ్, పార్లమెంట్ స్ట్రీట్, కరోల్ బాగ్, నౌరోజీ నగర్, పంత్ మార్గ్, మయూర్ విహార్ ఉన్నాయి.గురుగ్రామ్‌లోని సుభాష్ నగర్, ఓల్డ్ రైల్వే రోడ్డు, ఇతర ప్రాంతాల్లోని కీలక రహదారులపై నీరు చేరింది.

ఉత్తర ఢిల్లీలోని సబ్జీ మండి ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఢిల్లీ-ఎన్‌సిఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం)కి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Here's Video: