Free Gas Cylinders Scheme: వీడియో ఇదిగో, స్వయంగా టీ చేసి మహిళా లబ్ధిదారుకి అందించిన సీఎం చంద్రబాబు, ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం
దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
ఉచిత సిలిండర్ పథకం అమల్లోకి, మూడు సిలిండర్లు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
అనంతరం మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పింఛను అందజేశారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
CM Chandrababu started the free gas cylinder in Andhra Pradesh
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)