XE COVID Variant: దేశంలో మరో కొత్త వేరియంట్ కలకలం, ప్రమాదకర కరోనా ఎక్స్‌ఈ వేరియంట్‌ కేసును గుర్తించిన INSACOG

భారతదేశంలో కరోనా ఎక్స్‌ఈ వేరియంట్‌ కేసు ఒకటి నమోదైంది. ఇండియన్‌ సార్స్‌- సీఓవీ2 జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్షియం(ఐఎన్‌ఎ‌స్ఏసీఓజీ) ఏప్రిల్‌ 25కు సంబంధించి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

భారతదేశంలో కరోనా ఎక్స్‌ఈ వేరియంట్‌ కేసు ఒకటి నమోదైంది. ఇండియన్‌ సార్స్‌- సీఓవీ2 జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్షియం(ఐఎన్‌ఎ‌స్ఏసీఓజీ) ఏప్రిల్‌ 25కు సంబంధించి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. అయితే, ఈ కేసు ఏ ప్రాంతంలో నమోదైందనే వివరాలను మాత్రం చెప్పలేదు. గత వారంతో పోలిస్తే దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందని, 19 రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది.

అత్యంత ఎక్కువగా సంక్రమించే శక్తి ఉందని భావిస్తున్నఈ వేరియంట్ ఇదివరకే గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగు చూసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై ఖచ్చితమైన నిర్ధారణ లేదు. తాజాగా వైరస్ జన్యుసంక్రమణాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ప్రభుత్వం కన్సార్షియం (ఇన్సా కాగ్) దీనిపై స్పష్టత ఇచ్చింది. ఒమిక్రాన్ ఉపరకాలైన బి ఏ 1, బి ఏ, 2ల కలయికగా భావిస్తున్న ఎక్స్ఈ తొలుత బ్రిటన్లో వెలుగుచూసింది. ఆ తర్వాత పలు దేశాలకు పాకింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement