Dantewada Maoist Attack Video: మావోయిస్టులు మందుపాతర పేల్చిన వీడియో ఇదిగో, వాహనం మొత్తం పేల్చేశారు అంటూ చివర్లో వాయిస్

దంతెవాడలో ఒక డ్రైవర్‌ సహా పది మంది పోలీసులను పొట్టబెట్టుకున్నారు. దంతేవాడ్‌ పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పేలుడు తర్వాత.. ఓ పోలీస్‌ సిబ్బంది అక్కడే ఉన్న మావోయిస్టులపై కాల్పులు జరపడానికి యత్నించారు.

Naxal-Attack-in-Chhattisgarh (Photo-ANI)

దాదాపు రెండేళ్ల తర్వాత మావోయిస్టులు దారుణానికి పాల్పడిన సంగతి విదితమే. దంతెవాడలో ఒక డ్రైవర్‌ సహా పది మంది పోలీసులను పొట్టబెట్టుకున్నారు. దంతేవాడ్‌ పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పేలుడు తర్వాత.. ఓ పోలీస్‌ సిబ్బంది అక్కడే ఉన్న మావోయిస్టులపై కాల్పులు జరపడానికి యత్నించారు.

పేలుడు తర్వాత.. మరో వాహనంలో ఉన్న పోలీస్‌ సిబ్బంది ఒకరు అక్కడే ఉన్న మావోయిస్టుల వైపుగా వెళ్తూ.. కాల్పులు జరిపేందుకు పొజిషన్‌ తీసుకుంటూ కనిపించాడు. ఓ వాహనం కింద దాక్కున్న మరో పోలీస్‌ సిబ్బంది అక్కడి పరిస్థితులను తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోలో పేలుడు జరిగిన ప్రదేశం కనిపిస్తోంది. ‘‘వాహనం మొత్తం పేల్చేశారు..’’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వాయిస్‌ వినిస్తోంది. పేలుడు ధాటికి పడిన పదడుగుల లోతు గుంత అంచులనూ క్లిప్‌లో చూడొచ్చు. ఇక క్లిప్ చివరిలో, తుపాకీ శబ్దాలు వినిపించాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)