Data on Women Missing in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 72,767 మంది బాలికలు, మహిళలు మిస్సింగ్, వివరాలను వెల్లడించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంట్‌కు నివేదించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంట్‌కు నివేదించింది. వీరిలో 15,994 బాలికలు, 56,773 మంది మహిళలు ఉన్నట్టు తెలిపింది.
2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యమయ్యారని పేర్కొంది. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో తెలంగాణలో 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్రం తెలిపింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)