Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన అరవింద్ కేజ్రీవాల్,లిస్టు ఇదిగో..

ఇటీవ‌ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆప్‌లో చేరిన ఆరుగురికి తొలి జాబితాలో చోటు క‌ల్పించారు

Supreme Court grants bail to Delhi Chief Minister Arvind Kejriwal

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు(Delhi Assembly Elections) జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ 11 మంది అభ్య‌ర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఇటీవ‌ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆప్‌లో చేరిన ఆరుగురికి తొలి జాబితాలో చోటు క‌ల్పించారు. బ్ర‌హ్మ సింగ్ త‌న్వార్‌, అనిల్ జా, బీబీ త్యాగిలు బీజేపీ నుంచి ఆప్‌లో చేరగా..జుబైర్ చౌద‌రీ, వీర్ సింగ్ దింగ‌న్‌, సోమేశ్ షోకీన్‌లు కాంగ్రెస్ నుంచి ఆప్‌లోకి చేరారు.

జార్ఖండ్‌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, ఓటర్లు ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపారంటున్న సర్వేలు

కేజ్రీవాల్ ప్ర‌క‌టించిన జాబితాలో స‌రితా సింగ్‌, రామ్ సింగ్ నేతాజీ, గౌర‌వ్ శ‌ర్మ‌, మ‌నోజ్ త్యాగీ, దీప‌క్ సింఘాల్ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇక 2020లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో 62 స్థానాల‌ను గెలుచుకున్న‌ది.

Here's List

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)