Delhi Excise Policy Case: అక్టోబర్ 10 వరకూ ఈడీ కస్టడీకి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన రాజ్యసభ ఎంపీ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బుధవారం అరెస్ట్ అయిన ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను (Sanjay Singh) అక్టోబర్ 10 వరకూ ఈడీ కస్టడీకి తరలించారు.తన అరెస్ట్‌కు ముందు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బుధవారం అరెస్ట్ అయిన ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను (Sanjay Singh) అక్టోబర్ 10 వరకూ ఈడీ కస్టడీకి తరలించారు.తన అరెస్ట్‌కు ముందు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు. చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అదానీ స్కామ్‌లను తాను బహిర్గతం చేశానని, ఈడీకి ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని, దాడులు, అరెస్టులు వంటి వాటి ద్వారా విజయం సాధించలేరని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ తనను బలవంతంగా అరెస్టు చేస్తున్నదని చెప్పారు. కాగా గత ఏడాదిగా పలువురు ఆప్ నేతలను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేందర్ జైన్‌లను ఇప్పటికే ఈడీ వేర్వేరు కేసుల్లో దర్యాప్తు సంస్ధ అరెస్ట్ చేసింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)