Delhi Firing: ఢిల్లీలో మరో డాక్టర్ దారుణ హత్య, వైద్యం కోసం వచ్చి తుపాకీతో కాల్చి చంపిన ఇద్దరు అగంతకులు, వీడియో ఇదిగో..
హాస్పిటళ్లలో తమ భద్రతకు భరోసా నివ్వాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ.. మరో డాక్టర్ హత్యకు గురయ్యాడు. వైద్యం కోసం వచ్చిన ఇద్దరు యువకులు డాక్టర్‌ను (Doctor Murder) తుపాకీతో కాల్చి చంపారు.
ఢిల్లీలోని జైత్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటళ్లలో తమ భద్రతకు భరోసా నివ్వాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ.. మరో డాక్టర్ హత్యకు గురయ్యాడు. వైద్యం కోసం వచ్చిన ఇద్దరు యువకులు డాక్టర్‌ను (Doctor Murder) తుపాకీతో కాల్చి చంపారు. బుధవారం రాత్రి కాలి గాయానికి డ్రెస్సింగ్ కోసం ఇద్దరు టీనేజర్లు జైత్‌పూర్‌లోని నిమా హాస్పిటల్‌కు వచ్చారు. వారు అంతకు ముందు రోజు కూడా చికిత్స చేయించుకుని వెళ్లారు.
దారుణం, మొబైల్ ఫోన్ లాక్కుందని తల్లిని బ్యాట్‌తో చావబాదిన కొడుకు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
అదేవిధంగా బుధవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత కూడా ఆస్పత్రికు వచ్చారు. నర్సింగ్ స్టాఫ్ వారికి డ్రెస్సింగ్ పూర్తిచేశారు. అనంతరం తాము ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటామంటూ డాక్టర్ క్యాబిన్‌కు వెళ్లారు. కొద్ది సేపట్లోనే కాల్పుల శబ్దం వినిపించడంతో నర్సింగ్ సిబ్బంది గజాలా పర్వీణ్, ఎండీ కమిల్ క్యాబిన్‌కు వెళ్లిచూశారు. అప్పటికే తీవ్రంగా గాయపడి చనిపోవడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)