Hyderabad: గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేత వీడియో ఇదిగో, హైడ్రాలిక్ యంత్రం సాయంతో కూల్చివేస్తున్న అధికారులు
ఇక్కడి సిద్ధిఖి నగర్‌లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన నాలుగంతస్థుల కొత్త భవనం నిన్న పక్కకు ఒరిగిన సంగతి విదితమే. పక్కన మరో భవనం నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో దీనిపై ఆ ప్రభావం పడిందని అంటున్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్థుల భవనం కూల్చివేత పనులను అధికారులు చేపట్టారు. ఇక్కడి సిద్ధిఖి నగర్‌లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన నాలుగంతస్థుల కొత్త భవనం నిన్న పక్కకు ఒరిగిన సంగతి విదితమే. పక్కన మరో భవనం నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో దీనిపై ఆ ప్రభావం పడిందని అంటున్నారు. దీంతో నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఈ భవనం ఒక్కసారిగా గుంతల వైపు వంగింది. ఈ నేపథ్యంలో ఈ భవనం చుట్టుపక్కల స్థానికులను హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించి, హైడ్రాలిక్ యంత్రం సాయంతో కూల్చివేస్తున్నారు. పైఅంతస్తు నుంచి కూల్చివేతను ప్రారంభించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది పనులను పర్యవేక్షిస్తున్నారు.
Demolition of a four-storey building leaning sideways in Gachibowli
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)