Devara Daavudi Video Song: దేవర నుంచి దావూదీ వీడియో సాంగ్ ఇదిగో, పోటీపడి మరీ డ్యాన్స్ వేసిన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్
మేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా ప్రకటించిన ప్రకారం దావూదీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.ఈ పాటలో తారక్, జాన్వీకపూర్ పోటీపడి మరీ డ్యాన్స్ చేసినట్లు వీడియో సాంగ్ చెబుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో వస్తున్న మూవీ దేవర. దేవర మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.మేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా ప్రకటించిన ప్రకారం దావూదీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.ఈ పాటలో తారక్, జాన్వీకపూర్ పోటీపడి మరీ డ్యాన్స్ చేసినట్లు వీడియో సాంగ్ చెబుతోంది. ఇప్పటికే లాంచ్ చేసిన చుట్టమల్లె (Chuttamalle) మెలోడీ డ్యుయెట్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. చుట్టమల్లె పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. 100 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న దేవర చుట్టమల్లె సాంగ్, నాలుగు వారాలుగా మోస్ట్ ట్రెండింగ్ జాబితాలో..
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Here's Song
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)