CM Stalin Meets Vijayakanth: విజయకాంత్ ఇంటికి సీఎం ఎంకే స్టాలిన్, 15 నిమిషాల పాటు కెప్టెన్‌తో గడిపిన తమిళనాడు ముఖ్యమంత్రి, కరోనా నివారణ నిధికి రూ. 10 లక్షల చెక్కును సీఎంకు అందజేసిన విజయకాంత్
డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం పరామర్శించారు. డీఎంకే పార్టీ నేతలు దురైమురుగన్, రాజాలతో కలిసి విరుగంబాక్కంలోని విజయకాంత్ ఇంటికి స్టాలిన్ వెళ్లారు. విజయకాంత్‌ను శాలువతో సత్కరించారు.
డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం పరామర్శించారు. డీఎంకే పార్టీ నేతలు దురైమురుగన్, రాజాలతో కలిసి విరుగంబాక్కంలోని విజయకాంత్ ఇంటికి స్టాలిన్ వెళ్లారు. విజయకాంత్‌ను శాలువతో సత్కరించారు. తన పక్కన కూర్చోవాలని స్టాలిన్‌ను విజయకాంత్ కోరగా ఆయన పక్కనే కూర్చొని 15 నిమిషాల పాటు సీఎం స్టాలిన్ అక్కడే గడిపారు.
వారితో పాటు విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత, తనయుడు విజయ ప్రభాకరన్, బావమరిది సుదీష్ ఉన్నారు. అనంతరం కరోనా నివారణ నిధికి రూ. 10 లక్షల చెక్కును విజయకాంత్ సీఎంకు అందజేశారు. రాజకీయ వైర్యం మరిచి తమ నేతను స్టాలిన్ కలవడంపై డీఎండీకే నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని వీడి అమ్మామక్కల్ మునేట్ర కళగంతో కలిసి పోటీచేసిన డీఎండీకే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)