Earthquake in Arunachal: అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతగా నమోదు, ఛాంగ్‌లాంగ్‌కు 86 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం

సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్‌లాంగ్‌లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్‌లాంగ్‌లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. ఛాంగ్‌లాంగ్‌కు 86 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 14 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. భూపంకం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

Tweet