Farmers Protest: రైతుల ఉద్యమంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, ట్రాక్టర్లతో సిమెంట్ బారికేడ్లను తొలగించి నిరసనలో పాల్గొన్న రైతులు
‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్‌కు రైతులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా పోలీసులు వచ్చినవాళ్లను వచ్చినట్టే అరెస్ట్ చేసి స్టేషన్‌లకు తరలించారు.
పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్‌కు రైతులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా పోలీసులు వచ్చినవాళ్లను వచ్చినట్టే అరెస్ట్ చేసి స్టేషన్‌లకు తరలించారు.
కాసేపటికే రైతుల సంఖ్య పెద్ద ఎత్తున పెరగడంతో అరెస్టులు సాధ్యం కాలేదు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో ఆందోళనకారులు తలోదిక్కు పరుగులు తీశారు. అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇక హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతంలో నిరసన తెలుపుతున్న రైతులు తమ ట్రాక్టర్‌లను ఉపయోగించి సిమెంట్ బారికేడ్‌లను తొలగించడం కనిపించింది. కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో రైతులు ఛలో మార్చ్ నిర్వహించారు. కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్).. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించే చట్టాన్ని ఆమోదించడంతోపాటు తమ డిమాండ్లను మంజూరు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చ్‌ను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధానిలో రైతులు నిరసన, బవానా స్టేడియంను జైలుగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్నికోరిన కేంద్రం, రైతుల అరెస్టు సరికాదని తిరస్కరించిన కేజ్రీవాల్ సర్కారు
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)