Accident On Mumbai's Atal Setu: వీడియో ఇదిగో, ముంబై అటల్ సేతు వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు
ముంబైలో కొత్త నిర్మించిన అటల్ సేతు వంతెనపై మొదటి రోడ్డు ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో ఉన్న ఓ కారు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో సినిమా రేంజ్‌లో పల్టీలు కొట్టింది. వంతెనపై మరో కారులో ఉన్న డ్యాష్‌క్యామ్‌లో ఇదంతా రికార్డు అయ్యింది.
First Accident On Mumbai's New Atal Setu: ముంబైలో కొత్త నిర్మించిన అటల్ సేతు వంతెనపై మొదటి రోడ్డు ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో ఉన్న ఓ కారు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో సినిమా రేంజ్‌లో పల్టీలు కొట్టింది. వంతెనపై మరో కారులో ఉన్న డ్యాష్‌క్యామ్‌లో ఇదంతా రికార్డు అయ్యింది. కాగా, ఈ ప్రమాదంలో కారును ప్రయాణిస్తున్న వారు స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ప్రమాదానికి గురైన వారు రాయ్‌గఢ్‌లోని చిర్లేకు వెళ్తున్నట్టు సమాచారం.
ముంబైలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్ సేతు’ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనినే ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. ముంబైలో దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. కాగా అటల్ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు. ఇది ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్ ఫీజు ఒకవైపు రూ. 250 వసూలు చేయనున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)