Calcutta High Court: వేరు కాపురమంటూ భార్య వేధిస్తే..విడాకులకు భర్త దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. మానసికంగా వేధింపులకు గురిచేయడమేగాక సహేతుకమైన కారణాలు చూపకుండా అత్తమామల నుంచి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి చేస్తుంటే.. విడాకులు కోరే హక్కు భర్తకు ఉంటుందని తేల్చిచెప్పింది.

Calcutta High Court (Photo-ANI)

తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. మానసికంగా వేధింపులకు గురిచేయడమేగాక సహేతుకమైన కారణాలు చూపకుండా అత్తమామల నుంచి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి చేస్తుంటే.. విడాకులు కోరే హక్కు భర్తకు ఉంటుందని తేల్చిచెప్పింది.తల్లిదండ్రులతో ఉండడంతోపాటు వారిని పోషించడం కొడుకు బాధ్యత. భారతీయ సంస్కృతిలో ఇది భాగం’’ అని జస్టిస్‌ సౌమెన్‌ సేన్‌, జస్టిస్‌ ఉదయ్‌కుమార్‌ల ధర్మాసనం పేర్కొంది. తన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు మార్చి 31న ఈ వ్యాఖ్యలు చేసింది.

Here's Bar Bench Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement